Home  »  TV News  »  Podharillu:మాధవ పెళ్లి కోసం మహా సాహసం.. తాయారు ఇంట్లో హైడ్రామా!

Updated : Apr 3, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -84 లో..... గాయత్రి, మాధవ రాత్రి మాట్లాడుకున్న మాటలన్నీ మహా వింటుంది. ఎలాగైనా వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యాలని అనుకుటుంది. మాధవ ఇంటి నుండి పనికోసం వెళ్ళిపోయాక.. మిగతా ముగ్గురితో మాట్లాడుతుంది మహా. మీ అన్నయ్య మీ కోసం ఎంత హెల్ప్ చేసాడు.. మనం తన కోసం తన సంతోషం కోసం తనకి ఇష్టమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యలేమా అని మహా అంటుంది. చక్రి ఒక సలహా, కన్నా ఒక సలహా ఇస్తారు. అవేవీ సెట్ అవ్వవు..   ఏం చెయ్యాలో మీరే చెప్పండి అని కేశవ అడుగుతాడు.  మనం మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్లి గాయత్రిని మీ అన్నయ్యకి ఇవ్వమని అడుగుదామని మహా అంటుంది. అది జరిగే పని కాదని ముగ్గురు వెళ్ళిపోతారు.

ఆ తర్వాత కేశవ మెకానిక్ షాప్ కి వెళ్లి మహా అన్న మాటలు గుర్తుచేసుకుంటాడు. అప్పుడే శైలు వచ్చి గొడవపెట్టుకుంటుంది. మా నాన్నకి ఎందుకు ఫోన్ చేసావని గట్టిగా అరుస్తుంది నా డబ్బు నాకు ఇస్తే నీతో నాకెంటే అని కేశవ అంటాడు. ఆ డబ్బే ఉంటే నాకు ఇవ్వన్నీ కష్టాలు ఎందుకని శైలు అంటుంది. మరొకవైపు చక్రి, మహా మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు. వాళ్ళని అలా చూసి ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ప్రొద్దున అన్నది నాకు ఎందుకో కరెక్ట్ అనిపిస్తుంది.. వాళ్ళింటికి వెళ్లి మాట్లాడుదామని చక్రి అంటాడు. మరుసటి రోజు మాధవ వెళ్ళిపోయాక కేశవ, చక్రి, కన్నా, మహా కలిసి నారాయణ దగ్గరికి వెళ్లి మీ చెల్లి ఇంటికి వెళదామని మహా అంటుంది. మాధవకి గాయత్రి అంటే చాలా ఇష్టం కదా వాళ్ళని ఒక్కటీ చేద్దాం అని మహా అంటుంది. దానికి నారాయణ ఒప్పుకోడు.

ఆ తర్వాత మహా, చక్రి, కేశవ, కన్నా నలుగురు కలిసి సంబంధం మాట్లాడడానికి తాయారు ఇంటికి వెళ్తారు. అక్కడ మొహం పైనే ఆ ఇంటికి నా కూతురిని పంపించానని చెప్తారు. ఇంకా మాధవని తిడుతుంటే చక్రి కోపంగా గాయత్రి వాళ్ళ నాన్న పీకపట్టుకుంటాడు. మహాపై తాయారు కోప్పడుతుంటే.. తనపైకి కేశవ కర్ర తీసుకొని వెళ్తాడు. తాయారు తాంబులాన్ని కిందపడేస్తుంది. మీలాంటి మూర్కులతో మాట్లాడడానికి వచ్చాము.. మాది తప్పు అని మహా అంటుంది. తరువాయి భాగంలో మహా వాళ్ళు వెళ్ళిన విషయం మాధవకి నారాయణ చెప్తాడు. అసలు మీరెవరు వెళ్ళడానికి అని మహా పైకి మాధవ గట్టిగా అరుస్తాడు. దాంతో మహా బాధగా లోపలకు  వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.